ఇకనైన కానీ ఇప్పుడైన కానీ

దర్శించగా రావా
అభిషేకం లేక దర్శనము రాక
నశియించుచున్నానయ్యా (2)

కావలివాడు ఉదయం కోసం
మెలుకువ కలిగి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)

ఎండిన నేల వర్షం కోసం
నేలను విరచి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)

దుప్పి నీటి వాగుల కొరకు
ఇలలో ఎదురు చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *