అందమైన ఆకాశంలో మెరిసింది ఒక తార
ముచ్చటైన యేసుని చూపి మురిసింది ఆ తార (2)
లోకమునకే రక్షకుని రాకను తెలిపే తారగా
మానవులకే దేవుని వార్తను చాటే తారగా (2)
వెలిగింది కొత్తగా అందాల తార
వెలిసింది వింతగా అరుదైన తార (2)
దూత వచ్చి వార్త చెప్పి..పామరులను తట్టిలేపే
యేసుఎవరో..చూడగోరి..ఆశకలిగి..మందవిడిచి (2)
నడచిన గొల్లలకు మార్గమే చూపుటకు
పుట్టిన స్థలమునకు గొల్లలను చేర్చుటకు
ఉదయించిన నీతిసూర్యుని రూపము
దర్శించగా చిరునామై నిలిచిన (2)
అరుదైన తారగా అందాల తార
మెరిసింది కొత్తగా నీలిఆకాశన (2)
Happy Happy Christmas
Merry Merry Christmas (2)
A Wish You Happy Christmas
తూర్పుదిశలో ప్రజ్వలించి..నలుదిక్కులా వెలుతురాయే
లేఖనములు రుజువు చేసి..యేసు కొరకే సాక్ష్యమాయే (2)
వెదకిన జ్ఞానులకు క్రీస్తునే చూపుటకు
పుట్టిన స్థలమునకు జ్ఞానులను చేర్చుటకు
జన్మించిన రారాజుగా యేసుని
పూజించగా పరిచయమే చేసిన (2)
వింతైన తారగా అందాలతార
మురిసింది కిరణమై ఆకాశవీధిలో (2)
Happy Happy Christmas
Merry Merry Christmas (2)
A Wish You Happy Christmas
TELUGU