Neelanti Dhaivam Evaru
Neelanti Dhaivam Evaru Vishwamuna Lene Leru (2)
Parama Thandri Neeke Vandana
Yesu Naadha Neeke Vandana
Pavithrathma Neeke Vandana
Thriyyeka Deva Vandhana
Neethigala Dhaivam Neeve Karuna Choopu Daathavu Neeve (2)
Moranalakinchu Naa Deva Rakshanaadharamu Neevega (2)
Neethigala Dhaivam Neeve Karuna Choopu Daathavu Neeve (2)
Moranalakinchu Naa Deva Rakshanaadharamu Neevega (2)
Neevunte Chaalu Naaku Digule Ledhu
Nee preme Choodagane Sadgathiye (2)
||Neelanti Dhaivam||
Sarvonnathuda Neeke Stothram Mahaaa Ghanuda neeke sarvam (2)
Shakthi Daatha Dhaivam Neevega
Needhu Aathma Varamunu Koredha (2)
Sarvonnathuda Neeke Stothram Mahaaa Ghanuda Neeke Sarvam (2)
Shakthi Daatha Dhaivam Neevega
Needhu Aathma Varamunu Koredha (2)
Neenemi koralenu jeevithantham
Nee Dhayalo kaayumayya brathuku dhinam
Neelanti Dhaivam Evvaru Vishwamuna Lene Leru (2)
Parama Thandri Neeke Vandhanaaa
Needhu Bidda gane Saagedhaa
Yesu Naadha Neeke Vandhanaa
Jeevithantham Neekai Brathikedha
Pavithrathma Neeke Vandhana
Nithyamu Ne Neetho Nadichedha
Thriyyeka Deva Vandhana
Ganaparathu Ninne Nirathamu
O Deva! Daya Choopumayyaa
O Deva! Daya Choopumayyaa
Deshaanni Baagucheyumayyaa
Nee Prajala Moranu Alakinchumaa
Nee Krupalo Mammunu Nadipinchumaa
Manninchi Brathikinchu – Ujjeevam Ragilinchu
||O Devaa||
- Sarvaloka Rakshakaa – Karunichumayyaa
Nee Vaakya Sakthini – Kanuparachumayyaa
Andhakaara Prajalanu – Veliginchumayyaa
Punarutthaana Sakthitho – Vidipinchumayyaa - Okasaari Choodu – Ee Paapa Lokam
Nee Raktamtho Kadigi – Parishuddhaparachu
Deshanni Kshamiyinchu – Prematho Rakshinchu
||O Devaa||
Yesu Rakshaka
Yesu Rakshaka Shathakoti Sthothram
Jeevanadaatha Shathakoti Sthothram
Yesu Rakshaka Koti Koti Sthothram
Jeevanadaatha Shathakoti Sthothram
Yesu Bhajiyinchi Poojinchi Aaraadhinchedanu (2)
Naa Samasthamu Arpinchi Aaraadhinchedanu (2)
Yesu Aaraadhinchedanu – Aaraadhinchedanu
- Shouryudu Naa Praana Priyudu
Nannu Rakshimpa Nara Roopametthaadu (2)
Naa Silvamosi Nannu Swarga Lokamekkinchaadu (2)
Challani Devudu Naa Chakkani Yesudu (2) ||Yesu Rakshakaa|| - Pilichinaadu Neeve Naa Sotthannaadu
Ennatikini Edabaayanannaadu (2)
Thana Prema Choopa Naaku Nela Diginaadu (2)
Naa Seda Deerchi Nannu Jeevimpajesaadu (2) ||Yesu Rakshakaa||
Yesu Aaraadhinchedanu – Aaraadhinchedanu
Na Samasthamu Arpinchi -Aaraadhinchedanu
Naa Sarvamu Arpinchi – Aaraadhinchedanu
Sharanam Sharanam Yesu Swaami Sharanam (3) ||Yesu Aaraadhinchedanu||
Yesu Rakthame
Yesu Rakthame Jayamu Jayamu raa
Siluva Rakthame Jayamu Jayamu raa
Dhairyaanni Shouryaanni Nimpenura
Thana Pakshamu Nilabadina Gelupu Nidhera (2) |Yesu Rakthame||
Balaheenulaku Balamaina Durghamu – Mukthi Yesu Rakthamu
Vyaadhi Baadhalaku Vidudala Kaliginchunu – Swasthatha Yesu Rakthamu (2)
Shaanthiki Sthaavaram Shri Yesuni Raktham
Neethiki Kavacham Parishuddhuni Raktham (2)
Mruthyuvune Geluchu Rakthamu
Paathaalam Moyu Rakthamu
Narakaanni Bandhinchina
Jayasheeli Adhipathi Raaraaju Yesayye ||Yesu Rakthame||
Paapiki Sharanam Yesu Rakthamu – Rakshana Praakaaramu
Apavithraathmanu Paaradrolunu – Khadgamu Yesu Rakthamu (2)
Shathruvu Niluvadu Virodhi Evvadu?
Ae Ayudhamu Neepai Vardhilladhu (2)
Saathaanni Nalaggottina
Vaadi Thalani Chithaggottina
Kodhama Simhamai Megharudiga
Theerpu Thircha vachu Raraaju Yesayye ||Yesu Rakthame||
Yehova Needu Mellulanu
Yehova Needu Mellulanu
Ela Varnimpagalanu
Keerthinthunu Needu Premanu
Devaa Adi Entho Madhuram
Dhaivam Neevayya Paapini Nenayy
Needu Rakthamutho Nannu Kadugu
Jeevam Neevayyaa Jeevitham Needayya
Needu Saakshiga Nannu Nilupu
Kaarana Bhoothuda Parishuddhuda
Needu Aathmatho Nannu Nimpu
Maranatha Yesu Nadha
Needu Raajyamulo Nannu Cherchu ||Yehova||
- Ghanuda Silva Dharuda
Amulyam Needu Rudhiram (2)
Ninnu Aaraadhinche Brathuku Dhanyam
Neetho Maatladutayae Naaku Bhaagyam
O Mahonnathuda Neeke Sthothram
Sarvonnathuda Neeke Sarvam ||Yehova|| - Priyuda Praana Priyuda
Varame Needu Sneham (2)
Naa Rakshanakai Paramunu Veede
Naa Vimochanakai Kraya Dhanamaaye
O Mruthyunjayuda Neeke Sthothram
Paramaathmuda Neeke Sarvam ||Yehova||
నీలాంటి దైవం ఎవరు
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2)
పరమతండ్రి నీకే వందన
యేసునాథ నీకే వందన
పవిత్రాత్మ నీకే వందన
త్రియేక దేవా వందన
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2)
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2)
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2)
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2)
నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే (2) ||నీలాంటి దైవం||
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2)
శక్తి దాత దైవం నీవేగా
నీదు ఆత్మవరములు కోరేదా (2)
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2)
శక్తి దాత దైవం నీవేగా
నీదు ఆత్మవరములు కోరేదా (2)
నేనేమీ కోరలేను జీవితాంతం
నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం (2)
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు (2)
పరమతండ్రి నీకే వందన
నీదు బిడ్డగానే సాగేద
యేసునాథ నీకే వందన
జీవితాంతం నీకై బ్రతికెద
పవిత్రాత్మ నీకే వందన
నిత్యమునే నీతో నడిచెద
త్రియేక దేవా వందన
ఘనపరతు నిన్నే నిరతము
ఓ దేవా దయ చూపుమయ్యా
ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా||
సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా
పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా
ఒకసారి చూడు – ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా||
యేసు రక్షకా
యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా||
పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు రక్షకా||
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను||
యేసు రక్తమే
యేసు రక్తమే జయము జయమురా
సిలువ రక్తమే జయము జయమురా
ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా
తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు రక్తమే||
బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)
మృత్యువునే గెలుచు రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధించిన
జయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు రక్తమే||
పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము (2)
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు?
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలగ్గొట్టిన
వాడి తలనే చితగ్గొట్టిన
కొదమ సింహమై మేఘారూఢిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే ||యేసు రక్తమే||
యెహోవా నీదు మేలులను
యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధాన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం
||యెహోవా||
ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం
||యెహోవా||