Nee Premalo Prayaname – Nee Baatalo Prabhathame

Nee Premalo Prayaname – Nee Baatalo Prabhathame (2)
Neevega Aashrayam – Neelone Jeevitham
Sajeevudaa Pade Pade Ne Paadi Keerthinchana
Sadaa Ninnu Koniyadanaa
Nee Premalo Prayaname – Nee Baatalo Prabhathame
Premaya Naa Yesayya – Naa Praname Neevenaya

Nee Matale Vennante Saagene – Viduvani Nee Krupa Nannentho Kaachene
Prathi Malupu Nee Saakshyame – Prahti Swasa Nee Swasthyame
Sahincheti Nee Prematho – Mannincheti Naa Daivama
Kanneetilo Kashtaalalo – Nadipinche Nee Vaakhyame
Dayamaya – Krupamaya – Neeve Sadaa Thodugaa
Naa Throvalo Needaga
||Nee Premalo||


Nee Snehame Varinche Sonthamai – Madilo Nee Swaram Vasinche Deepamai
Ennenno Tarangaalalo – Krungincheti Gaayalalo
Ninne Kore Naa Vedana – Ninne Chere Naa Prardhana
Chukkanivai Sahayamai – Dari Cherche Nee Prematho
Dayamaya – Krupamaya – Nee Premaye Chalaya
Naa Gamyame Neevaya
||Nee Premalo||

నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే

నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే (2)
నీవేగా ఆశ్రయం – నీలోనే జీవితం
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
సదా నిన్ను కొనియాడనా
నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే
ప్రేమామయా నా యేసయ్య – నా ప్రాణమే నీవేనయా

నీ మాటలే వెన్నంటే సాగెనే – విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
ప్రతీ మలుపు నీ సాక్ష్యమే – ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
సహించేటి నీ ప్రేమతో – మన్నించేటి నా దైవమా
కన్నీటిలో కష్టాలలో – నడిపించె నీ వాక్యమే
దయామయా – కృపామయా – నీవే సదా తోడుగా
నా త్రోవలో నీడగా

||నీ ప్రేమలో||

నీ స్నేహమే వరించే సొంతమై – మదిలో నీ స్వరం వసించే దీపమై
ఎన్నెన్నో తరంగాలలో – కృంగించేటి గాయాలలో
నిన్నే కోరే నా వేదన – నిన్నే చేరే నా ప్రార్ధన
చుక్కానివై సహాయమై – దరి చేర్చే నీ ప్రేమతో
దయామయా – కృపామయా – నీ ప్రేమయే చాలయా
నా గమ్యమే నీవయా
||నీ ప్రేమలో||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *